వివేకా కేసు.. సీబీఐ వన్‌సైడ్.. టోటల్ కన్ఫ్యూజన్.!

-

వివేకా హత్య కేసు..గత ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు ఏపీ రాజకీయాల్లో ఇదే అతి పెద్ద టాపిక్.. కరెక్ట్  గా 2019 ఎన్నికల ముందు వివేకా హత్య జరిగింది. అప్పుడు టి‌డి‌పి అధికారంలో ఉంది. అయితే మొదట గుండెపోటు అని, తర్వాత హత్య అని తేలింది. ఈ హత్య ఎవరు చేశారనేది పెద్ద మిస్టరీగా మారింది. అప్పుడు అధికారంలో ఉన్న టి‌డి‌పి నేతలే హత్య చేశారని వైసీపీ నేతలు, కాదు కాదు కడప ఎంపీ సీటు కోసం సొంత వాళ్ళే చంపేశారని టి‌డి‌పి నేతలు రాజకీయ ఆరోపణలు చేసుకున్నారు.

అప్పుడు టి‌డి‌పి ప్రభుత్వం సిట్ విచారణ వేసింది. అప్పుడు ఏమి తేలలేదు. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. కేసు సి‌బి‌ఐకి ఇవ్వాలని వివేకా కుమార్తె సునీత కోర్టుకు వెళ్లారు. ఇక సి‌బి‌ఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే సి‌బి‌ఐ..గత నాలుగు ఏళ్లుగా ఈ కేసుని విచారిస్తూనే ఉంది. కానీ ఈ విచారణలో తేల్చింది శూన్యమని, కేవలం ఒకే దిశగా విచారణ సాగుతుందని ది వైర్ అనే జాతీయ ఇంగ్లీష్ వెబ్‌సైట్ తేల్చింది. కేవలం ఎంపీ అవినాష్ రెడ్డి టార్గెట్ గానే విచారణ సాగుతుందా? అనే కోణం కనిపిస్తుందని చెప్పింది.

ఎంపీ సీటు కోసమే వివేకాని చంపించారనేది సి‌బి‌ఐ కోణం.. కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే.. వివేకా హత్యకు ముందే అవినాష్‌కు కడప ఎంపీ సీటు ఫిక్స్ అయింది. అవినాష్ కోసం వివేకా ప్రచారం కూడా చేశారు. అయితే ఈ కోణంలో సి‌బి‌ఐ విచారణ లేదని ‘వైర్’ కథనం చెబుతుంది.  అలాగే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. ఆయనకు ఈ హత్యతో ప్రమేయం ఉందని చెప్పే ఒక్క ఆధారమూ కోర్టుకు చూపలేదు.

అటు వివేకా.. షర్మిలని ఎంపీగా నిలబెట్టాలని అనుకున్నారని, అవినాష్‌ని బలమైన అభ్యర్ధిగా భావించలేదని అనుకుంటే..ఆయన గత ఎన్నికల్లో 3 లక్షల మెజారిటీపైనే గెలిచారు. అయితే షర్మిల వాంగ్మూలం ప్రకారం..కడప ఎంపీ సీటు తన కోసం వివేకా..జగన్ తో మాట్లాడతానని చెప్పారని పేర్కొన్నట్లు కథనాలు వచ్చాయి. కానీ షర్మిల ఇచ్చిన వాంగ్మూలానికి ఆధారం ఉందా అంటే అదీ లేదు. ఇటు చూసుకుంటే వివేకా రెండో పెళ్లి చేసుకోవడం కుమార్తె సునీతా, మొదటి భార్య సౌభాగ్యమ్మలకు  ఇష్టం లేదు.. అందుకే ఆయనకు ఉన్న చెక్ పవర్ సైతం లాగేసుకున్నారన్నది అందరికీ తెలిసిందే.

అలాగే సౌభాగ్యమ్మ సోదరులు తనను బెదిరించినట్లు షమీమ్ వెళ్లి సీబీఐ వద్ద వాంగ్మూలం ఇచ్చారు. అలాంటప్పుడు ఆర్ధిక లావాదేవీలు వల్లే వివేకా మర్డర్ జరిగిందనే కోణంలో సి‌బి‌ఐ ఎందుకు విచారణ చేయలేదని వైర్ కథనంతో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా గాని సి‌బి‌ఐ అనేక కోణాలు వదిలేసి.. కేవలం ఒకే దిశగా ముందుకెళుతూ.. నాలుగేళ్లలో ఏమి తేల్చకుండా.. సమయం మొత్తం వృధా చేసిందని వైర్ కథనం తేల్చింది.

Source by:   https://thewire.in/politics/fact-fiction-cbi-vivekananda-reddy-murder-case

Read more RELATED
Recommended to you

Latest news