‘కేంద్రానికి జగన్ ని అడ్డుకునే సీన్ లేదు ‘ ఈ మ్యాటర్ లీక్ చేసింది ఎవరు ? 

1355

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీ బిజెపి పార్టీతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంలో చర్చలు జరుగుతున్న సందర్భంలో అమరావతి లో ఆందోళనలు నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించి అమరావతి రాజధానిని అంగుళం కూడా కదలనివ్వను అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.

Related image

ఇదే సందర్భంలో బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ “రాజధానిని మార్చాలంటే కేంద్రం అనుమతి కోరాల్సిందే” అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో చాలామంది ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చిన జగన్ నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకునే చాన్స్ ఉందని కామెంట్లు చేస్తున్న తరుణంలో వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఈ మేటర్ పై కొన్ని వ్యాఖ్యలు లీక్ చేశారు.  అసలు ఈ వ్యవహారం మొత్తం కేంద్రంలో ఉన్న పెద్దల దృష్టిలో చర్చించిన తర్వాతే జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాజధాని విషయంలో కేంద్రానికి అసలు సంబంధం లేదని అది మీ విషయం మీరు చూసుకోవాలని కేంద్ర ప్రజలు జగన్ కి సూచించినట్లు వైసిపి పార్టీ నేతలు కొన్ని వ్యాఖ్యలు లీక్ చేశారు.