అమరావతి పై కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం ?

1531

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన గాని శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువ ఉన్న తెలుగుదేశం పార్టీ రూల్‌ 71ను తెర మీదకు తెచ్చి వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుని వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. ఇలాంటి రూల్ వల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించే అవకాశం ఉండటంతో శాసనమండలిలో మళ్లీ ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశం లేని నేపథ్యంలో జగన్ సర్కార్ శాసన మండలి ని రద్దు చేయటానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

Image result for amaravathi modi

అయితే నిపుణుల వాదన ప్రకారం శాసన మండలి రద్దు అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు. ఆర్టికల్ 169 ప్రకారం శాసన మండలిని రద్దు చేసే, ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్ కుంది. అయితే ఒకసారి రద్దయిన మండలిని ఏర్పాటు చేయాలన్నా.. ఒకసారి ఏర్పాటు చేసిన మండలిని రద్దు చేయాలన్నా దానికి శాసన సభ తీర్మానాన్ని ఆమోదించాలి. అటువంటి పరిస్థితుల్లో శాసనమండలిలో ఈ తీర్మానం పాస్ అవ్వాలంటే వైసీపీ పార్టీకి పెద్ద విషయం కాదు కానీ పార్లమెంటు స్థాయిలో రాజ్యాంగ సవరణ అవసరం దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాలి.

ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి రద్దు అంశం కేంద్రం దృష్టికి వెళ్తే కేంద్రంలో పెద్దలు మాత్రం జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు ఎందుకంటే గతంలోనే 2019 ఎన్నికల ప్రచారంలో బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో భూసేకరణ విషయంలో చాలా అవకతవకలు జరిగాయని బలంగా ఆరోపించడం తో పాటు అధికారంలోకి బీజేపీ వస్తే ఎవరి భూములు వారికి ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలంగా చెప్పటంతో బీజేపీ వాదన జగన్ వాదన ఒకటే కావడంతో వికేంద్రీకరణ బిల్లుని శాసన మండలిలో అడ్డుకున్న దానిని పై స్థాయిలో మాత్రం శాసనమండలిని రద్దు చేసి వికేంద్రీకరణ బిల్ పాస్ అవ్వడానికి కేంద్రం కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు ఇటువంటి చారిత్రాత్మక బిల్లు విషయంలో అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.