అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబు హయాంలో అమరావతి ప్రాంతంలో ఒక ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యులు అదేవిధంగా బినామీలు ఏ విధంగా భూములు కొన్నారు ఎవరు ఎక్కడ ఎంత ఎన్ని ఎకరాలు కొన్నారు రాజధాని విషయంలో చంద్రబాబు మనుషులు భూదందా ఏ విధంగా చేశారుఅన్ని విషయాలను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధారాలు మరియు సాక్షాలతో సహా బయటపెట్టారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా అమరావతి రాజధాని ప్రకటించక ముందు అమరావతి ప్రాంతాలలో భూములు ఎన్ని ఎకరాలు కొనటం జరిగిందో అన్ని విషయాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన స్పీచ్ లో బయటపెట్టారు. ఒకవైపు శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ప్రాంతాలలో పర్యటించి ఉండగానే మరో పక్క చంద్రబాబు సర్కారు భూములు కొని కార్యక్రమం చేపట్టిందని సర్వే నెంబర్లతో సహా బుగ్గన చెప్పారు. అలాగే ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరాం, అల్లుడు వడ్లమూడి శ్రీ హర్ష పేరిట కూడా ఎక్కడెక్కడ భూములు కోన్నారో చెప్పారు.
చంద్రబాబు తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.25 ఎకరాలు కొన్నట్లు బాబుగారి బినామీ బ్యాచ్ మొత్తం అమరావతి ప్రాంతంలో రాజధానిగా ప్రకటించక ముందే ఇదంతా మొదలుపెట్టినట్లు అసెంబ్లీ సాక్షిగా అనేక విషయాలను జగన్ సర్కార్ బయటపెట్టి అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు తన వర్గ ప్రజల కోసం ఏ విధంగా వ్యవహరించారు అన్న దాన్ని విషయంలో బయటపెట్టి చంద్రబాబు ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారు అన్న దాని విషయంలో ప్రజలకు తెలియజేయటం లో జగన్ సూపర్ హిట్ అయ్యారు.