పెద్ద ప్లాన్ వేసి రంగం లోకి దిగిన చంద్రబాబు కి .. గాలి మొత్తం తుస్సుమంది..!!

-

టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. 2019 ఎన్నికల నాటి నుండి రాజకీయంగా వరుసగా దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత చంద్రబాబుకి పార్టీలోనూ మరియు సొంత నియోజకవర్గంలో కూడా విలువ లేకుండా పోయినట్లు వార్తలు ఇటీవల వస్తున్నాయి. అయితే ప్రతిపక్షంగా కొద్దిపాటి బలం ఉన్నాగాని వైయస్ జగన్ ని చాణిక్య రాజకీయంతో ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్న పెద్దగా వేస్తున్న ప్లాన్లు వర్క్ ఔట్ కావడం లేదు.Image result for chandrbabu

తాజాగా పెద్ద ప్లాన్ వేసి రంగంలోకి దిగిన చంద్రబాబు కి ఎదురు దెబ్బ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక సంస్థల ఎన్నికలను ఓటమి భయంతో రాజకీయం ఎన్నికలను వాయిదా వేయడంతో…ఒక పక్క పార్టీ పరువు మరో పక్క రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ రావటంతో కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా కొన్ని వేల కోట్లు నిధులు విడుదల చేయటం అందరికీ షాక్ ఇచ్చింది.

 

అయితే 14వ ఆర్థిక సంఘం నిధులు విడుద‌ల చేయాల‌ని కోరుతూ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఇటీవ‌ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను క‌లిసి విన్న‌వించాడు. ఈ నేప‌థ్యంలో  ఆంధ్రప్రదేశ్‌కు బకాయి ఉన్న నిధుల్లో 1301.23 కోట్లను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో విడతగా అందాల్సిన రూ.870.23 కోట్లు… పట్టణ స్థానిక సంస్థలకు 2019-20 సంవత్సరపు తొలి విడత వాయిదా రూ.431 కోట్లను ఇచ్చేసింది. అలాగే మిగతా రాష్ట్రాలకు చెందాల్సిన నిధులు కూడా కేంద్రం మంజూరు చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను అదేవిధంగా నిధులను ఆపేశామని తెగ సంబరపడిపోయిన చంద్రబాబు వర్గం గాలి తుస్సుమ నట్లయింది.

Read more RELATED
Recommended to you

Latest news