వృద్ధులు, నిరుపేదలంటే చంద్రబాబుకి ఎందుకంత కక్ష..? మరి ఇంత శాడిజమా అంటున్న ఏపీ ప్రజలు..

-

చంద్రబాబుకి కొంచెం కూడా మానవత్వం లేదు.. మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తాడు.. ప్రజలకి మంచి జరుగుతుంటే చూసే మనస్తత్వం చంద్రబాబుది కాదు.. ఈ మాటలన్నీ ప్రస్తుతం ఏపీలోని వృద్ధులు వికలాంగులు అంటున్నవి.. వాలంటీర్ వ్యవస్థ పై కక్షి కట్టిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో పింఛన్ ని వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయించొద్దని తన మనుషుల ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించారు.. దీంతో ఎన్నికల కమిషన్ పంపిణీకి బ్రేక్ చెప్పింది.. ఈ వ్యవహారంపై రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు, వికలాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

మంచాన పడ్డ వికలాంగులు… మరొకరి సాయంతో కూడా తమ పనులు చేసుకోలేని వృద్ధులు విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి శాడిజాన్ని ప్రదర్శించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇంటికెళ్లి మరి పింఛన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థపై కక్ష కట్టారు.. ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయించొద్దంటూ ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించడంతో రాష్ట్రంలోని వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మండుటెండలో దూరప్రాంతాలకు వెళ్లి తాము పింఛన్ ఎలా తెచ్చుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న మంచిని చంద్రబాబు భరించలేకపోతున్నారని, వృద్ధులు వికలాంగులు ప్రభుత్వానికి అండగా ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారని పలువురు వృద్ధులు చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల ఇంటివద్దె పింఛన్ తీసుకునే అవకాశాన్ని తాము కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన చంద్రబాబు నాయుడు.. పేదలు సంతోషంగా ఉండటం చూడలేక నిమ్మగడ్డ ప్రసాద్ వంటి వారి చేత ఇలాంటి నీచపు పనులు చేయిస్తున్నారని విమర్శిస్తున్నారు..

పేదలకు పెత్తందారులకు ఏపీలో యుద్ధం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న మాటలు ఈ విషయంలో అక్షరాలా నిజమయ్యాయి.. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటూ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తోంది.. ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటింటికి వెళ్లి వాలంటీర్ల ద్వారా పింఛన్ సైతం అందిస్తోంది.. దీనిపై చంద్రబాబు నాయుడు కుట్రపన్ని తాను పెత్తందారులకు మద్దతుగా ఉన్నానని.. నిరుపేదను సంతోషంగా ఉండడం తనకు ఇష్టం లేదని మరోసారి నిరూపించారు.. పెన్షనర్లను ఇబ్బంది పెట్టి తాను పేదల మీద గెలిచారని చంద్రబాబు సంబరపడుతున్నారు.. కోర్టులో గెలిచిన చంద్రబాబు ప్రజాక్షేత్రంలో ఓడిపోవడం ఖాయమని.. ఓడించి తీరుతామని పింఛన్దారులు వృద్ధులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news