విజయవాడ ఎంపీ కేశినేని నాని అలాగే ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మధ్య గత కొంత కాలంగా యుద్ధం నడుస్తుంది. వీళ్లిద్దరి మధ్య యుద్ధం దెబ్బకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయవాడలో ఇప్పుడు పార్టీ సమస్యలను పరిష్కరించడానికి చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారని తెలుస్తోంది. పార్టీలో ఉన్న కీలక నేతల మధ్య విభేదాలు రావడంతో చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు.
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు విజయవాడ బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కేసినేని నాని ఎక్కడ వెనక్కు తగ్గక పోవడం బుద్ధ వెంకన్న వర్గం కూడా ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా వెళ్లడంతో జరిగే నష్టాన్ని అంచనా వేసిన చంద్రబాబు గల్లా జయదేవ్ కు బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. లేకపోతే మరో సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
దేవినేని ఉమ తో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యలను పరిష్కరించడానికి చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు. ఇక పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు కూడా విజయవాడలో పని చేయకుండా ఎంత సేపు విభేదాలతోనే రాజకీయం చేస్తూ వస్తున్నారని మంత్రి వెల్లంపల్లి వ్యవహారాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే ఈ విభేదాల కారణంగా పార్టీని నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే త్వరలో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుని పార్టీలో సమస్యలను పరిష్కరించే బాధ్యతలను మరో నేతకు అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం.