టీడీపీ నేతపై తీవ్ర ఆగ్రహం…!

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా బలహీనంగా ఉన్న టీడీపీ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై సొంత పార్టీలో కూడా టీడీపీకి షాక్ తగిలింది. పార్టీలో కీలకంగా ఉన్న విజయవాడ ఎంపీ కేసినేని నానీ కొన్ని వ్యాఖ్యలు చేసారు.

జగన్ సిఎం అవ్వడానికి, వైసీపీ అధికారంలోకి రావడానికి సహకరించిన అధికారిని సన్మానం చేస్తారూ అనుకుంటే సస్పెండ్ చేసారు ఏంటీ అంటూ కేసినేని నానీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఇది తీవ్ర దుమారం రేపగా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న విజయవాడ టీడీపీ నేత పట్టాబి కొన్ని వ్యాఖ్యలు చేసారు. నానీ వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని కవర్ చేసే ప్రయత్నం చేసారు ఆయన.

తాజాగా జరిగిన టీడీపీ సమావేశంలో చంద్రబాబు నాయుడు పట్టాబి మీద మండిపడ్డారు. అసలు నువ్వు ఎందుకు మాట్లాడావ్ అంటూ చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పట్టాభి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలే తప్ప ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా చంద్రబాబు పట్టాభిని హెచ్చరించారు చంద్రబాబు. ఈ సమావేశం మంగళవారం జరిగింది.