ఏపీలో సరికొత్త పొత్తు పొడుపు…బాబు తిప్పేస్తున్నారుగా!

-

ఏపీలో బలంగా ఉన్న జగన్‌ని ఎదురుకునేందుకు చంద్రబాబు వేయని వ్యూహాలు లేవు….చేయని రాజకీయం లేదు. జగన్ అధికార పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి ఏదొరకంగా జగన్‌ని ఇబ్బంది పెట్టాలనే విధంగా చంద్రబాబు రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో కేంద్రంలో అధికారంలో బీజేపీకి దగ్గవ్వాలని కూడా బాబు చేయని ప్రయత్నం లేదు. కానీ ఏది కూడా వర్కౌట్ కావడం లేదు. ఇటు ఏపీలో జగన్‌ని దెబ్బకొట్టడంలో బాబు పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు.

అటు బీజేపీకు దగ్గరవ్వడంలో కూడా విఫలమవుతున్నారు. ఏ కోశాన కూడా బాబుని బీజేపీ దగ్గరకు రానివ్వడం లేదు. కానీ ఎన్ని జరిగినా బాబు రాజకీయం వేరు…ఆయన ఒక దారి కాకపోతే మరొకదారిలో వచ్చేస్తారు. ఎలాగైనా జగన్‌ని పడగొట్టాలనే కసితో ఉన్న బాబు, పవన్ కల్యాణ్‌ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇటీవల ఆయన చేస్తున్న రాజకీయాలని బట్టి అర్ధమవుతుంది. అటు పవన్ కూడా బాబు విషయంలో కాస్త మెతక వైఖరితోనే ఉన్నారని తెలుస్తోంది.

ఇటు బాబు టార్గెట్…అటు పవన్ టార్గెట్…జగన్ మాత్రమే. అందుకే ఈ ఇద్దరు కలవడానికి చూస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ వీరు విడిగా ఉంటే జగన్‌కే బెనిఫిట్. ఆ విషయం గ్రహించిన బాబు…పవన్‌ని దగ్గర చేసుకుంటున్నారు. పవన్ కూడా బాబుకు దగ్గవ్వాలనే చూస్తున్నారు. కానీ పవన్…బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీ మాత్రం బాబుతో కలవమని చెప్పేస్తుంది…అలాగే పవన్‌ని సైతం బాబుకు దగ్గరవ్వనివ్వకుండా ప్రయత్నాలు చేస్తుంది. కానీ బీజేపీ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేదు. ఒకవేళ బీజేపీ కలిసొస్తే ఓకే…లేదంటే బీజేపీని సైడ్ చేసి పవన్, కమ్యూనిస్టులతో కలిసి సరికొత్త పొత్తుకు తెరలేపాలని బాబు చూస్తున్నట్లు తెలుస్తోంది.

అటు కేంద్రంలో ఎలాగో ఈ సారి బీజేపీకి అనుకున్న మెజారిటీ వచ్చేలా లేదు. ఇటు విపక్షాలు, కాంగ్రెస్‌తో కలిసి కేంద్రంలో బీజేపీని గద్దె దించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో బాబు, కాంగ్రెస్‌కు సాయం చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికైతే బాబు ఏపీ రాజకీయాన్ని ఒకేసారి తిప్పేసేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news