చంద్రబాబు కేసులో ఎప్పుడు ఏం జరిగింది…?

-

అమరావతిలో అక్రమాలు జరిగాయని ముందు నుంచి అధికార వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఈ ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో ఈ అక్రమాలు జరిగాయి అని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నేడు చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు. ఈ తరుణంలో దీనిపై కీలక చర్చలు జరుగుతున్నాయి.

ఫిబ్రవరి 24న ఎంఎల్ఏ రామకృష్ణ సీఐడికి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసారు. అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్దీకరించాడన్న అభియోగాలు పై కేసు నమోదు చేసారు. మార్చి12న కేసు నమోదు చేసిన సీఐడీ… చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణలకు నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వంలో పలుకుబడిని ఉపయోగించి అమాయకులను భయభ్రాంతులకు గురి చేశారంటూ ఫిర్యాదు వెళ్ళింది.

ఎస్‌సి, ఎస్‌టి, వీకర్‌ సెక్షన్ లకు చెందిన కాంతి ముందో భూములను బలవంతంగా, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే తీసుకున్నారని అభియోగం మోపారు. ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీకి డిఎస్పి సూర్యభాస్కర్‌ రావు ఈ నెల 12న ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు అని తెలిసింది. నివేదికలో అభియోగాలన్నీ నిజమని తేల్చడంతో సీఐడీ అదనపు డీజీ ఆదేశాలు మేరకు కేసు నమోదు చేసారు. అధికారులు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news