గడప గడపకు ఎమ్మెల్యేలు వెళ్ళి…ప్రజలకు సంక్షేమ పథకాలు అందిన తీరుపై వివరించాలని రెండు నెలల క్రితమే సీఎం జగన్…ఎమ్మెల్యేలకు సూచించిన విషయం తెలిసిందే. ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని జగన్..ఎమ్మెల్యేలని గడప గడపకు వెళ్లాలని సూచించారు. అలాగే ఆరు నెలల్లో ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగు పర్చుకోవాలని, లేదంటే నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని చెప్పేశారు. అయితే ఇదంతా గత వర్క్ షాపులో జగన్…ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్లాస్.
ఇక తాజాగా కూడా వర్క్ షాపులో జగన్…ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. గడప గడపకు వెళ్లాలని, ప్రజలకు తాము చేసిన మంచి పనులని వివరించాలని, అలాగే తాను చేసే పనులు తాను చేస్తూనే ఉన్నానని, ఇంకా మీ పని మీరు చేస్తే..175కి 175 సీట్లు గెలుచుకోవచ్చని చెప్పారు. అలా కాకుండా సరిగ్గా పనిచేయని వారికి నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని చెప్పేశారు. టికెట్ ఇవ్వలేదని తన మీద అలిగిన ప్రయోజనం లేదని చెప్పేశారు.
అలాగే ఇంకా ఆరు నెలల సమయం ఇస్తున్నానని…ఈలోపు ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పర్చుకోవాలని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు గడప గడపకు ఎక్కువ రోజులు వెళ్ళిన ఎమ్మెల్యేల్లో నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు టాప్ లో ఉన్నారు…అలాగే ఓ 15 మంది ఈ కార్యక్రమంలో ఎక్కువ పాల్గొన్నారు.
అయితే ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం..ఒక్కరోజు కూడా గడప గడప కార్యక్రమంలో పాల్గొలేదని స్వయంగా జగన్ చెప్పుకొచ్చారు. అలాగే ఇంకొంతమంది ఎమ్మెల్యేలు తక్కువ రోజులు కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. గతంలో కూడా నాని, నల్లపురెడ్డి పేర్లే ఎక్కువ వినిపించాయి. మెరుగైన పనితీరు కనబర్చడంలో ఈ ఇద్దరు విఫలమవుతున్నట్లు జగన్ కు అందిన నివేదికల్లో తెలిసింది.
ఇక వీరికి జగన్ మరొక ఛాన్స్ ఇచ్చారు..ఆరు నెలల్లో పనితీరు మెరుగు పర్చుకోవాలని అన్నారు…మరి ఆరు నెలల తర్వాత కూడా ఈ ఇద్దరు డౌన్ లో ఉంటే అప్పుడు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే ఇద్దరు సీనియర్లు..పైగా ఇద్దరు జగన్ కు సన్నిహితులే. మరి అలాంటప్పుడు ఈ ఇద్దరు విషయంలో జగన్ ఎలా ముందుకెళ్తారో చూడాలి.