భారత దేశ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లను పెంచుతున్నారు.SBI ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు రూ.2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచడం కారణంగా ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది..
కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లొకి వచ్చాయి.ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను ఒకటి నుంచి రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే ఖాతాల కోసం సాధారణ ప్రజలకు 4.75 శాతం నుంచి 5.25 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు SBI FDలపై అధనంగా 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది. బ్యాంక్ ఇతర కాలపరిమితిపై రేట్లను స్థిరంగా ఉంచింది. సవరించిన వడ్డీ రేట్లు తాజా డిపాజిట్లకు, మెచ్యూర్ అయ్యాక పునరుద్ధరించే డిపాజిట్లపై వర్తిస్తాయని SBI వెబ్సైట్ లో వెల్లడించింది.. అంతకన్నా ముందు డిపాజిట్స్ ను క్యాన్సిల్ చేసుకుంటే పెనాల్టీ కూడా ఉంటుందని చెప్పారు..
ఈ వారంలో పెరిగిన వడ్డీ రేట్లు..
* 7 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
* 46 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.50 శాతం
* 180 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
* 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
* 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.75 శాతం
* 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
* 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
* 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం..
ఈ నెల ఆఖరు లోగా వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం..
జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7% పైన ఉన్నందున.. RBI ఆగస్టు MPC సమావేశంలో వడ్డీ రేట్లను మరింత పెంచడానికి సిద్ధంగా ఉంది..