రెండో రోజు ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పోలీస్ కస్టడీ.. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు

-

హైదరాబాద్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వనస్థలిపురం కు చెందిన ఓ మహిళపై ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడ్డారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం, ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులలో ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ని అరెస్టు చేసిన పోలీసులు నేడు రెండవ రోజు పోలీస్ కస్టడీలో విచారిస్తున్నారు.ఇప్పటికే నాగేశ్వర్రావు ను 5 రోజుల పాటు పోలీస్ కస్టడి కి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.

చర్లపల్లి జైల్ నుండి కస్టడీకి తీసుకున్నవనస్థలిపురం పోలీసులు..ఈనెల 22వరకు నాగేశ్వరరావును విచారించనున్నారు.సరూర్ నగర్ ఎస్వోటి కార్యాలయంలో నాగేశ్వరరావును పోలీసులు విచారిస్తున్నారు.ఈ కేసులో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు.కీలక ఆధారాల కోసం విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే నిందితుడి వద్దనుండి సేకరించిన షాంపిల్స్  FSL కు పంపనున్నారు పోలీసులు. కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ జరపనున్నారు.నిందితుడి కన్ఫేషన్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news