హామీలను నమ్మి జనం ఓట్లేశారు.. అలాంటి హమీలను అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతోంది.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వర్కౌట్స్ చేస్తోంది.. సమయం లేదు మిత్రమా.. త్వరలోనే అమలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది.. వైసీపీ పోరాటాలకు సిద్దం అవ్వకముందే.. జనాలకు చేరువ అయ్యేందుకు సీఎం చంద్రబాబు మాష్టర్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు.. ఇంతకీ హామీల అమలు ఎప్పుడంటే..?
త్వరలోనే సూపర్ సిక్స్ స్కిమ్స్ కి మోక్షం కల్పించేలా చంద్రబాబునాయుడు పక్కాగా అడుగులేస్తున్నారు.. నవంబర్ లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తిస్తాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికారులకు పలు ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబునాయుడు.. అందుకు అవసరమైన బడ్జెట్ ను కూడా రెఢీ చేస్తోంది.. పుల్ బడ్జెట్ పెట్టి సూపర్ సిక్స్ పథకాలకు నిధులు అలాట్ చేసింది..
దాదాపు రెండు లక్షల 90వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ పద్దును తీసుకురాబోతుంది కూటమి సర్కార్.. జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.. జులైలో బడ్జెట్ పెట్టాల్సింది కానీ.. రాష్ట ఆర్దిక పరిస్తితి సరిగాలేదని అందుకే ఆలస్యమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. అప్పులు, వడ్డీలు, రాబడి వాటిపై సర్కార్ లెక్కలేసుకుంటోంది.. నవంబర్ రెండో వారంలో బడ్జెట్ ను తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది..
పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టి.. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు.. త్వరగా ప్రజలకు పథకాలను చేరువ చేసి.. ప్రతిపక్షానికి చాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు.. దీంతో త్వరలోనే సూపర్ సిక్స్ పథకాలను త్వరగా అమలు చెయ్యాలని డిసైడ్ అయ్యారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.. మొత్తంగా.. ప్రజల నుంచి వ్యతిరేకత రాకముందే.. పథకాల అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారన్నమాట..