ఝార్ఖండ్ ఎన్నికలపై ప్రధాని మోడీ దృష్టి.. పర్పెక్ట్ స్టాటజీతో ప్రచారం..

-

మోడీ ఛరిష్మా.. ఆయన ఫాలో అయ్యే స్టాటజీతో దేశంలోని పలు రాష్టాల్లో బిజేపీ అధికారంలో ఉంది.. తాజాగా హర్యానా గెలుపుతో మంచి ఊపుమీదున్న కమలం పార్టీ.. అదే జోష్ ను ఝార్ఖండ్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది.. దీంతో రీజియన్స్ వారిగా విభజించి.. కీలక నేతలకు బాధ్యతలు అప్పగించబోతోంది.. మోడీ చేత బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది.. ఇంతకీ ఝార్ఖండ్ లో కమలం పార్టీ ఫాలో అయ్యే స్టాటజీ ఏంటో చూద్దామా..

త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను కమలం పార్టీ సిద్ధం చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దేశ ప్రజల్లో ఉన్న ఆదరణ చెక్కు చెదరకపోవడంతో ప్రతి రాష్టంలో వారికి సానుకూల ఫలితాలు వస్తున్నాయి.. అయితే ఝార్ఖండ్ లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది.. చిన్న చిన్న అవకాశాలను సైతం వదలుకోకుండా.. పర్పెక్ట్ గా ప్లాన్ చేసుకుంటోంది.. ప్రచార బాధ్యతలను మోడీకి కాకుండా.. కీలక నేతలకు అప్పగించి.. మోడీ ద్వారా పరిమిత సమావేశాలు నిర్వహించాలని బిజేపీ భావిస్తోందట..

మోడీ తక్కువ బహిరంగ సభల్లో హాజరై.. పదునైన విమర్శలు చెయ్యడం ద్వారానే హర్యానాలో గెలుపు సాధ్యమైందని బిజేపీ నేతలు చెబుతున్నారు.. హర్యానాలో ఆయన పదునైన ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వీలైనంతమేర స్థానిక నాయకత్వానికే ప్రాధాన్యత కల్పించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న హర్యానాలో మోదీ తన నాయకత్వం కంటే నాయబ్ సింగ్ సైనీ నాయకత్వంపై ప్రజలకు భరోసా కల్పించగలిగారు. ఇదే వ్యూహాన్ని
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చెయ్యాలని కమలం పార్టీ భావిస్తోందట..జార్ఖండ్‌ రాజధాని రాంచీతో మొదలుపెట్టి, జార్ఖండ్‌లోని 6 ప్రాంతాలను కవర్ చేసేలా మొత్తం 7 ప్రచార సభల్లో మోడీ పాల్గొనేలా బిజేపీ ప్లాన్ చేస్తోందని ఆ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు..

భౌగోళికంగా చిన్న రాష్టంగా ఉన్న ఝార్ఖండ్ ను 6 ప్రాంతాలుగా విభజించి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్టాటజీతో ప్రచారాలకు వెళ్లేందుకు బిజేపీ సిద్దమైంది.. జార్ఖండ్‌లో పాలము, సంతాల్ పరగణ, కొల్హాల్, ఉత్తర చోటానాగ్‌పూర్, దక్షిణ చోటానాగ్‌పూర్, కోయిలాంచల్ ప్రాంతాలున్నాయి. బొగ్గు, ఇతర ఖనిజాల గనులు అధికంగా ఉన్న కోయిలాంచల్‌లో ధన్‌బాద్, బొకారో, గిరిదిహ్ పట్టణాలున్నాయి. బీజేపీ సంస్థాగతంగా రాష్ట్రంలో ప్రతి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తే అధికారం సాధ్యపడుతుందని భావిస్తోంది. దీంతో ప్రతి ప్రాంతంలో ప్రధాని మోదీతో ఒక సభ ఉండేలా ఏర్పాట్లు చేసింది. దీని ద్వారాఅన్ని ప్రాంతాలను కవర్ చేసినట్లు ఉంటుంది.. మోడీ ప్రభావంతో సునాయాసంగా అభ్యర్దులు గెలుస్తారని బిజేపీ అగ్రనేతలు లెక్కలేసుకుంటున్నారు.. ఈ స్టాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news