వాలంటీర్లకు చంద్రబాబు షాక్

-

ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. ప్రతి నెల పింఛన్లను వాలంటీర్లు పంపిణీ చేసేవారు. అయితే.. ఈ సారి వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు వేల రూపాయలతో పాటు మూడు నెలలకు సంబంధించి పెండింగ్ 3000 తో కలిపి.. మొత్తం 7000 అందించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఏపీలో సంక్షేమానికి ఆధ్యుడు నందమూరి తారక రామారావు. అయితే ఆయన హయాంలో పింఛన్ మొత్తాన్ని 75 రూపాయలు అందించేవారు. అటు తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సైతం దానిని కొనసాగించారు. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు రాజశేఖర్ రెడ్డి. సామాజిక పింఛన్ మొత్తాన్ని 75 రూపాయల నుంచి 200 కు పెంచుతానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మాటను నిలబెట్టుకున్నారు. పింఛన్ మొత్తాన్ని 200 రూపాయలకు పెంచారు. అయితే.. 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు చంద్రబాబు. తాను అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పింఛన్ మొత్తాన్ని రెండు వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు.

2019 ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ పోతూ 3000 అందిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 250 రూపాయలకు పెంచుకుంటూ పోయారు. 2024 నాటికి మూడు వేల రూపాయల పింఛన్ అందించగలిగారు. ఈ ఎన్నికలకు ముందు కూడా జగన్ పింఛన్ మొత్తాన్ని పెంచుతానని హామీ ఇచ్చారు. 3,500 కు పెంచుతానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత 250 రూపాయలు, 2028 తర్వాత మరో 250 రూపాయలు పెంచుతానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే పెంచిన పింఛన్‌ను వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్నాడన్న వార్తలు రావడంతో.. తమ భవిష్యత్‌ ఏమైపోతుందోనన్న భయంలో వాలంటీర్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news