పంటలకు కనీస మద్దత్తు ధర చట్టం పై హర్యానా ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీస మద్దత్తు ధర చట్టం తీసుకురావడం అనేది సాధ్యం కాదని అన్నారు. కనీస మద్దత్తు ధర చట్టం తీసుకు వస్తే.. కేంద్ర ప్రభుత్వం పై భారం పడుతుందని అన్నారు. అయితే శుక్ర వారం రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో హర్యానా ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమావేశం అయ్యాడు.
ఈ సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఖట్టర్ వ్యాఖ్యల పై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట కు కనీస మద్దత్తు ధర ఉంటనే రైతులు బాగుపడుతారని అంటున్నారు. కాగ ఎంఎస్ పీ చట్టం తీసుకు రావాలని రైతులు దేశ వ్యాప్తంగా ఆందోళన లు చేస్తున్నారు. సాగు చట్టాల పై రైతులు చేస్తున్న ఉద్యమం సఫలం కావడం తో .. ప్రస్తుతం కనీస మద్దత్తు ధర చట్టం తీసుకురావాలని పోరాటం చేస్తున్నారు.