ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు రాజధాని విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారు అనేది అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. రాజధానిని ఏ విధంగా అయినా సరే మార్చాలి అని పట్టుదలగా ఉన్న జగన్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఏ నిర్ణయం ప్రకటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. జగన్ ప్రకటించే దానిపై రేపు ఎం జరుగుతుంది అనేది చూడాలి.
అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడానికి తెలుగుదేశం పట్టుదలగా ఉంది. తెలుగుదేశం నేతలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా జారి చేసారు. ఇదిలా ఉంటే సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ రెండు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ రెండు బిల్లుల్లో మొదటిది ‘ఆంధ్రప్రేదశ్ అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం 2020’.
రెండోది ఏంటంటే గతంలో రాజధాని కోసం తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సీఆఆర్డీఏ చట్టాన్ని మార్చనుంది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ మార్పు చట్టం 2020’ పేరుతో సీఆర్డీఏ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అయితే ఈ బిల్లుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ విధంగా ఈ బిల్లుని మారుస్తారని తెలుగుదేశం ప్రశ్నిస్తుంది. మనీ బిల్లుగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.