జగన్ ఒక్క ప్రచారమే కాదు… ఇది కూడా మెయిన్…?

Join Our Community
follow manalokam on social media

తిరుపతి ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లడంతో అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రచారం పైన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు కూడా అధికార వైసీపీ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇబ్బంది పడుతుందనే భావన చాలా వరకు కూడా వ్యక్తమైంది. రాజకీయ పరిస్థితులు వైసీపీని తిరుపతి పార్లమెంటు పరిధిలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నాయని అందరూ భావించారు.

jagan

అయితే కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి జగన్ తప్పులు చేయడం తో తిరుపతి పార్లమెంటు పరిధిలో చాలామంది నేతలు ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా వెళ్లి ప్రచారం చేయడంతో వైసీపీ నేతల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. ఇప్పుడు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న కొన్ని సమస్యలను ముఖ్యమంత్రి జగన్ పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

చాలా మంది ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంపీలు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తిరుపతి పార్లమెంటు పరిధిలో ప్రచారం చేసే వాళ్ళు అందరిని కూడా ఏకతాటిపైకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. కొంతమంది వ్యక్తిగత ఇమేజ్ వున్న వాళ్ళ సొంత గా ముందుకు వెళ్లడం పార్టీలో సమస్యలకు దారితీస్తుంది. కొంతమందిని కలుపుకొని వెళ్లడం లేదు అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఈ సమస్యలను తిరుపతి పార్లమెంటు పరిధిలో పరిష్కరిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉండవచ్చు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...