రేపటి నుంచే సున్నా వడ్డీ…! జగన్ మరో సంక్షేమ కార్యక్రమం…!

-

కరోనా లాక్ డౌన్ లో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే సిఎం వైఎస్ జగన్ మాత్రం సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కు తగ్గడం లేదు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్వాక్రా మహిళల కోసం జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన బుధవారం డ్వాక్రా సంఘాలకు లేఖలు రాసారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసారు జగన్.

శుక్రవారం నుంచి డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు జగన్. పొదుపు సంఘాల అప్పులకు వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసారు. ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’ డ్వాక్రా సంఘాలకు మరింత ఊతంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. సీఎం వ్యక్తిగతంగా ఈ ల్హాలను డ్వాక్రా సంఘాలకు రాయగా… గ్రామ సమాఖ్యల ద్వారా మహిళలకు అందించే ఏర్పాటు చేస్తున్నారు.

తన క్యాంప్ కార్యాలయంలో జగన్ ఈ పథకాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు. ఒక బటన్‌ నొక్కగానే సెర్ప్‌, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడత డబ్బులు జమ అవుతాయని సెర్ప్‌ సీఈవో రాజాబాబు ఈ సందర్భంగా వివరించారు. 90,37,254 మంది మహిళా సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1400 కోట్లు ఒకే విడత జమ చేస్తారు. డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్‌, మెప్మా అధికారుల ఫోన్‌ నంబర్లు లేఖలో ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news