ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్…!

-

తెలంగాణాలో ఉద్యోగుల జీతాలను కట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పుడు కేసీఆర్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాయి. మహారాష్ట్ర కూడా ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు ఈ నెల సగం జీతం ఇచ్చి తర్వాత సగం జీతం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆదాయం పడిపోయింది.

ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కేంద్రం కూడా సహాయం చేయడానికి ముందుకి వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాన్ని రెండు దఫాలుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె. ఆర్.సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. కేవలం ఇబ్బందుల కారణంగా మాత్రమే రెండు దఫాలుగా మార్చి జీతం ఇస్తామన్నారన్నారు.

ఇది విరాళం కాదని, జీతంలో కోత కాదని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ప్రస్తుతం ఏమి బాగోలేదన్న ఆయన… లాక్ డౌన్ కారణంగా రోజుకి రెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి తరపున మేము సహకరిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news