ఈ నెలాఖర్లో విశాఖ వెళ్ళిపోతున్న జగన్…!

-

రాజధాని తరలింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనక్కు తగ్గే అవకాశాలు ఎక్కడా కనపడటం లేదు. హైకోర్ట్ చెప్పినా సరే న్యాయ విభాగాన్ని కర్నూలు తరలించిన జగన్ సర్కార్ త్వరలోనే మరికొన్ని కీలక కార్యాలయాలను విశాఖకు తరలించే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ వస్తుంది. ఈ నెలాఖర్లో ఎక్కువ కార్యాలయాలను విశాఖ తరలిస్తారని అంటున్నారు.

కీలక శాఖలు అన్నీ కూడా ఫిబ్రవరి చివరి వారంలో విశాఖ నుంచి పని చేస్తాయని అంటున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి సెలెక్ట్ కమిటీలో ఉంది. ఆ బిల్లులు ఇప్పట్లో ముందుకి వెళ్ళే అవకాశాలు కనపడటం లేదు. దీనికి తోడు జగన్ కూడా మండలి రద్దు తీర్మానం ప్రవేశ పెట్టి దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారు. దీనితో వికేంద్రీకరణ బిల్లు గురించి ఇప్పుడు పెద్దగా చర్చలు జరగడం లేదు.

అయితే జగన్ అనుకున్నది సాధించడానికి ఎంత వరకు అయినా వెళ్ళే తత్వం ఉన్న వ్యక్తి కావడంతో రాజధాని మార్పు ఖాయంగా కనపడుతుంది. న్యాయస్థానం చెప్పినా సరే న్యాయ విభాగాన్ని తరలించారు జగన్. అలాంటిది పరిపాలానా విభాగాలను తరలించడం ఆయనకు పెద్ద విషయం కాదని అంటున్నారు. ఇప్పటికే విశాఖలో భవనాలను కూడా సిద్దం చేసుకున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news