అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వంలో అలజడి… జగన్ సంచలన నిర్ణయం…!

రాజధాని వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ రాజధాని విషయంలో శుక్రవారం అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ఏపీ ప్రభుత్వం ప్రారంభించినట్టు తెలుస్తుంది. రాజధానిలో కొంత భాగాన్ని కర్నూలుకి తరలించింది. పాక్షిక న్యాయ విభాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ సభ్యుల ఆఫీస్‌లను కర్నూలుకు తరలిస్తున్నట్లు ఉత్తర్వులు జారి చేసారు.

ఇప్పటి వరకు ఈ విభాగాలన్ని వెలగపూడి సచివాలయంలో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్ని కర్నులుకి వెళ్ళే౦దుకు గాను జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారి చేసారు. ఈ విభాగాలన్నింటికి అవసరమైన బిల్డింగ్‌లను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ మరియు కర్నూలు కలెక్టర్‌కు జగన్ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో హైకోర్టు అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తరలించరాదని గతంలో న్యాయస్థానం హెచ్చరించినా సరే… పరిపాలన సౌలభ్యం పేరుతో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ తీసుకున్న నిర్ణయంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మూడు రాజధానుల విషయంలో దూకుడుగా ఉన్న ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం అందరిని షాక్ కి గురి చేస్తుంది.