జగన్ సంచలన నిర్ణయం, ఉక్కిరి బిక్కిరి అవుతున్న బాబు…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు సహా టీడీపీ అవినీతి విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా దూకుడుగా అడుగులు వేస్తున్నారు. గత అయిదేళ్ళ కాలంలో టీడీపీ చేసిన పలు అవినీతి కార్యక్రమాలపై విపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు చేసిన జగన్ ఇప్పుడు వాటిని నిజం చేయడానికి సిద్దమయ్యారు.

టీడీపీ అవినీతి మీద ఆయన దూకుడుగానే వెళ్తున్నారు. తాజాగా ఆయన సిట్ ని ఏర్పాటు చేసారు. పది మంది సీనియర్ అధికారులతో సిట్ ని ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. దానికి పోలీస్ స్టేషన్ కి ఉండే అధికారాలతో పాటుగా ఎవరిని అయినా విచారణకు పిలిచే అధికారాలను కల్పిస్తూ నిర్ణయ౦ తీసుకున్నారు. దీనితో గత ప్రభుత్వ నిర్ణయాలను, వాటి వలన లబ్ది పొందిన వారిని గుర్తించే పనిలో సిట్ పడింది.

ఇక ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని సిట్ పరిధిలోకి తీసుకొస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం సిట్ పరిధిలోకి వస్తుందని, దానికి విశేష అధికారాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీలో ఆందోళనకు కారణంగా మారింది. తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం మట్టి సహా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.

ఇక మంత్రులుగా ఉన్న వాళ్ళు… ఇంచార్జ్ లు గా కొన్ని కొన్ని జిల్లాల్లో పెత్తనం చేస్తూ తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీనితో రాష్ట్ర ఖజానా ఇబ్బంది పడింది. ఇప్పుడు సిట్ కి విశేష అధికారాలు ఇవ్వడంతో ఒక్కసారిగా టీడీపీ మాజీ మంత్రులలో ఆందోళన మొదలయింది. ఎప్పుడు ఎవరిని విచారణకు పిలుస్తారో తెలియక ఆందోళనలో ఉన్నారు కొంత మంది సీనియర్ మంత్రులు.

Read more RELATED
Recommended to you

Latest news