బీజేపీ బుల్డోజర్ కామెంట్లకు కేసీఆర్ సూపర్ కౌంటర్

ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు బుల్డోజర్ వస్తుందంటూ.. తెగ కామెంట్లు చేస్తున్నారు. బుల్డోజర్లు కారును తొక్కుతాయంటూ బీజేపీ సోషల్ మీడియా టీఆర్ఎస్ ను ఉద్దేశించి ట్రోల్స్ చేస్తున్నారు. యూపీ ఎన్నికల్లో యోగి ఆధిత్య నాథ్ ను ప్రతిపక్షాలు బుల్డోజర్ బాబా అని విమర్శించడంతో బుల్డోజర్ వ్యాఖ్యలు చాలా ఫేమస్ అయ్యాయి. దీంతో ఈ వ్యాఖ్యలనే ఇటీవల 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఆ పార్టీ నాయకులు విస్త్రుతంగా ప్రచారం చేస్తున్నారు.

తాాజాగా ఈరోజు జరిగిన సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఓ మీడియా విలేకరి అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు కేసీఆర్. ముఖ్యంగా బీజేపీ పార్టీకి, ఆపార్టీ నాయకులకు సూపర్ కౌంటర్ ఇచ్చారు. బుల్డోజర్లు వస్తున్నాయట కదా సార్ అని అడిగితే… ‘‘ఏం వస్తున్నాయి… ఏం చేస్తయటా… ఏమైనా పని దొరికితే చేసుకుని బతుకుతరు పాపం.. ఏమున్నదళ్ల‘‘  అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.