గిరిజన రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మాణం చేసి పంపితే.. ప్రధాని నరేంద్ర మోదీ బేఖాతరు చేస్తోందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల డిమాండ్లు, ప్రజల అవగాహన తెలియదని.. మూర్ఖంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేసీఆర్ విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని.. ఈ పనికిరాని మత పిచ్చిగాళ్లను బంగాళాఖాతంలో విసిరేయాలని కేసీఆర్ అన్నారు. మన వాల్మీకి బోయలకు రిజర్వేషన్లు రావాలన్నా.. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు రావాలన్నా… మనం ముందుకు పోవాలన్నా.. తెలంగాణకు వ్యతిరేఖంగా ఉన్న కాషాయ జెండాలను, బీజేపీని బంగాళా ఖాతంలో విసిరేయాలని ఆయన పిలుపునిచ్చారు. దాని కోసం అందరం సంసిద్ధంగా ఉండాలి… పోరాటం చేయాలి, న్యాయం కోసం పోరాడాలని సీఎం కేసీఆర్ అన్నారు. దేశాన్ని నాశనం చేసేవారికి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. భారత దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి.. దేశ రాజకీయాలను చైతన్య పరిచి..ఎవరెన్ని కష్టాలు పెట్టినా..మడమ తిప్పకుండా పోరాటం చేస్తా అని సీఎం కేసీఆర్ అన్నారు.
బీజేపీ పార్టీని, కాషాయ జెండాలను పీకి బంగాళా ఖాతంలో పారేయాలి: సీఎం కేసీఆర్
-