బ్రేకింగ్:ఢిల్లీ పర్యటనకు సిఎం కేసీఆర్…?

తెలంగాణా సిఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనను ఇబ్బంది పెట్టాలి అని భావిస్తున్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఇతర పార్టీల నేతలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ తో సిఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.

పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో ఆయన సమావేశం అవుతున్నారు. ఇప్పటికే వీరికి ఆయన ఫోన్ లు కూడా చేసారు. ఆ తర్వాత గోవా విపక్ష పార్టీతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే శివసేన కీలక సంజయ్ రౌత్ తో ఆయన సమావేశం అవుతున్నారు. వచ్చే నెల ఈ భేటీకి సంబంధించి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.