శిశువుకు ”కేటీఆర్ ” అని నామకరణం చేసిన కేసీఆర్

-

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామానికి చెందిన కలిగేటి కవిత – లక్ష్మణ్ దంపతుల కుమారునికి కేటీఆర్ అని నామకరణం చేసారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. దళిత బంధు పథకం పై సమీక్ష నిర్వహించిన అనంతరం… కరీంనగర్‌ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు కవిత – లక్ష్మణ్ దంపతులు.

ఈ నేపథ్యం లో వారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కలిశారు. ఈ నేపథ్యం లో వారి కుమారుడికి కేటీఆర్ అని నామకరణం చేసారు కేసీఆర్‌. అనంతరం… సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం తుక్కుపూర్ లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను పరిశీలించారు సీఎం కేసీఆర్.  కరీంనగర్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళుతూ హెలికాప్టర్ నుంచి పరిశీలించారు సీఎం కేసీఆర్‌. కాగా… ఇప్పటికే ఆరు మోటార్ల ద్వారా మల్లన్న సాగర్ లోకి నీటి విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం మల్లన్న సాగర్ పూర్తి స్థాయి సామర్ధ్యం 50 టీఎంసిలు ఉన్నట్లు అధికారులు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news