ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్‌రావుకు టీఆర్ ఎస్‌లో గత ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రాధాన్యత ఈ సారి పెద్దగా కనిపించలేదు. గత ప్రభుత్వంలో ఆయన స్వయంగా ఎన్నో హామీలు ఇచ్చేవారు. కానీ ఈ సారి కేవలం జిల్లాకే పరిమితం అయ్యారు. ఆయన్ను సీఎం కేసీఆర్ యాక్టివ్‌గా ఉండనివ్వలేదు. ఏదైనా ఉంటే కేసీఆర్ లేదా కేటీఆర్ మాత్రమే ప్రకటిస్తున్నారు.
అయితే ఇప్పుడు మళ్లీ హరీశ్‌రావును కేసీఆర్ దగ్గరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినప్పటి నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఉద్యమ నాయకులకు టీఆర్ ఎస్‌లో విలువ లేదని ప్రతిపక్షాలు, వివిధ సంఘాల నేతలు, ఉద్యమకారులు విమర్శించారు.
ఇదే క్రమంలో ఈటల రాజేందర్ కూడా హరీశ్‌రావుకు ఎన్నో అవమానాలు జరిగాయని, ఆయనకు విలువ లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో మంత్రి వర్గంలో ఉన్న ఉద్యమకారుల్లో ముఖ్యుడైన హరీశ్‌రావును కేసీఆర్ మళ్లీ దగ్గరకు తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో ఆయన ప్రాముఖ్యతను పెంచుతున్నారు. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆయన్ను ఢీ ఫ్యాక్టో కమిటీ చైర్మన్‌గా నియమించారు. అలాగే ఆయన వెంటే గాంధీ, ఎంజీఎం ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. ఒకవేళ హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు సమాచారం.