కేసీఆర్ ధీమా పోతే కొంప మునుగుతుంది…?

-

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని టిఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నా… ఇక్కడ పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. ఆ అంశాన్ని పక్కన పెడితే కొన్ని కొన్ని అంశాలు మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత కొందరు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం ఉంది.

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకపోవచ్చు. అయితే ఇక్కడ ఎంతమాత్రం కూడా టిఆర్ఎస్ పార్టీకి ధీమా పనికిరాదు అంటూ కొంతమంది హెచ్చరిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తే మంచిది అనే భావన కూడా టిఆర్ఎస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం కోసం కష్టపడుతున్నది.

కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉంది. కాని టిఆర్ఎస్ పార్టీకి అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనే దాని పైనే చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి సీఎం కేసీఆర్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ధీమాగా ముందుకు వెళ్తే దెబ్బ తగిలినా ఆశ్చర్యం లేదు అంటూ కొంతమంది హెచ్చరిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీలలోకి కొంతమంది నేతలు వెళ్లి పోయే అవకాశాలు కూడా ఉండవచ్చని ముఖ్యంగా షర్మిల విషయంలో నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ పార్టీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news