న్యూ ట్విస్ట్: పొత్తు బాటలో కేసీఆర్?

-

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అసలు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. అలాగే అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ని దెబ్బకొట్టడానికి ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఏ స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. అటు టీఆర్ఎస్ కూడా బీజేపీకి చెక్ పెట్టడానికి కొత్త కొత్త వ్యూహాలతో ముందుకెళుతుంది.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఇటు కాంగ్రెస్ కూడా దూకుడుగానే రాజకీయం చేస్తుంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఇప్పుడే ఏదో ఎన్నికలు ఉన్నట్లు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గెలుపు అంత సాధ్యం కాదనే విషయం మాత్రం క్లియర్‌గా అర్ధమవుతుంది. రెండుసార్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు మూడోసారి అధికారంలోకి రావడం చాలా కష్టంగా మారుతుంది. పైగా బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తుంది.

కాబట్టి కేసీఆర్ ఈ సారి స్ట్రాటజీ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే పొత్తు పెట్టుకోవడానికి కూడా కేసీఆర్ రెడీ అవుతునట్లు కనిపిస్తోంది. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్‌గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి సింగిల్‌గా పోటీ చేస్తే గెలవడం కష్టం కాబట్టి..ఎం‌ఐ‌ఎం, కమ్యూనిస్టులతో కలిసే వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎం‌ఐ‌ఎంతో ఎలాగో అనధికారికంగా పొత్తు ఉంటుంది.

ఎం‌ఐ‌ఎం వల్ల హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌కు బెనిఫిట్ అవుతుంది. ఇక బీజేపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే కమ్యూనిస్టులని దగ్గర చేసుకోవాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో కమ్యూనిస్టులు కాస్త రాజకీయంగా వెనుకబడ్డారు. కానీ వారికి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో మంచి పట్టు ఉంది. కాబట్టి వారిని కలుపుకుంటే కాస్త ప్లస్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కేసీఆర్ పొత్తు దిశగానే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news