ముదిరాజ్‌లంటే కేసీఆర్‌కి చుల‌క‌నా??

-

తెలంగాణ రాజకీయాలు మంచి హీటు మీద ఉన్నాయి. 2024 సంవత్సరం మొదట్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా అధికారికంగా ఎన్నికల సంఘం ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకున్నా , రాజకీయ పార్టీలు అన్నీ అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు, వ్యూహ ప్రతివ్యూహాలతో బిజీగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న BRS కు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కానీ ఈ ఎన్నికల్లో BRS కు సరైన పోటీ ఇవ్వగలిగే ఛాన్స్ ఉన్న ఇతర పార్టీలు కాంగ్రెస్ మరియు బీజేపీలు కేసీఆర్ తలపొగరు దించే సమయం ఆసన్నమైంది, వచ్చే ఎన్నికల్లో మాదంటే మాదే విజయం అంటూ చెప్పుకుంటున్నాయి. ఇప్పటి వరకు BRS ప్రకటించిన ఎమ్మెల్యే సీట్ లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలలో కనీసం ఒక్క చోట కూడా బీసీ ముదిరాజ్ లకు ఇవ్వకపోవడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీసీ లపై ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం ఇంతటి వివక్ష చూపిస్తోందని ప్రశ్నిస్తున్నారు.

 

కేసీఆర్‌
కేసీఆర్‌

తెలంగాణలో 60 లక్షలకు పైగానే ముదిరాజ్ లు ఉన్నా ఒక్క సీటు కూడా ఇవ్వాలని కేసీఆర్ కు అనిపించలేదా ? ఇంతలోనే BRS కు మేము అంతా శత్రువులు అయిపోయామా అంటూ ముదిరాజ్ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. గతంలో BRS లో మంత్రిగా పని చేసిన ముదిరాజ్ సామాజికవర్గ నేత ఈటల రాజేందర్ మీద ప్రతీకారంగా ఇలా మొత్తం ముదిరాజ్ లనే వెలేశారా లేదా బీసీ లపైన ఆగ్రహంతో ఇలా చేశారా అంటూ అధికార ప్రభుత్వంపై ప్రతీకార జ్వాలలు రేగుతున్నాయి. ఇక రాష్ట్రంలోని మరో రెండు కీలక పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్ లు అయినా ముదిరాజ్ లకు సీట్ల కేటాయింపులో సముచిత స్థానం కల్పిస్తారా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది.

 

ఇక 2018 లో పఠాన్ చెరు నియోజకవర్గంలో BRS ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి కి షాక్ ఇచ్చే విధంగా చిట్కుల్ సర్పంచ్ గా ఉన్న నీలం మధు నియోజకవర్గం మీద పట్టును సాధించారు. BRS అధినాయకత్వం దృష్టిలో పడేలాగా నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు నిర్వహించారు నీలం మధు. నియోజకవర్గంలో నీలం మధు నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గంలో ఒక బలమైన నేతగా అధిష్టానం దృష్టిలో పడడంతో ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు అన్నకే వస్తుందని ఎంతో ఆశ అభిమానులలో ఉండేది. కానీ మళ్ళీ తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గూడెం మహిపాల్ రెడ్డి నే ప్రకటించడంతో, ముదిరాజ్ లు ఒక్క సీటు అయినా వస్తుంది అనుకుని ఖంగు తిన్నారు. ఇక మరో వైపు టీడీపీ మరో రెండు రోజులలో ప్రకటించనున్న అభ్యర్థుల జాబితాలో చాలా వరకు ముదిరాజ్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న వార్త వైరల్ గా మారింది

Read more RELATED
Recommended to you

Latest news