ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో వన్ డే వరల్డ్ కప్ ఇండియా వేదికగా జరగనుంది. ఇందుకోసం బీసీసీఐ భారీగా ఏర్పాట్లను చేస్తోంది. ఇందుకోసం బీసీసీఐ భారీగా ఆదాయాన్ని సృష్టించుకునే మార్గాన్ని అన్వేషిస్తోంది. ఇక ఇందుకోసం క్రికెట్ మ్యాచ్ లు ప్రసార హక్కుల కోసం ఆగష్టు 31వ తేదీన ముంబై లో వేలం జరుగనుంది. కాగా ఏ వేలంలో డిస్నీ + హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, వయాకామ్ సంస్థలు ప్రధానంగా ఈ హక్కుల కోసం పోటీ పడనున్నాయి. ఈ హక్కులు ఎంత మొత్తానికి అమ్ముడు పోతాయి అన్నది ఆ రోజునే తెలియనుంది. ఇక బీసీసీఐ ఈ ప్రసార హక్కుల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బును ఆర్జించడానికి ఒక కొత్త పద్దతిని అమలుచేయనుంది.. అందుకోసం టీవీ మరియు డిజిటల్ హక్కులను వేర్వేరుగా అమ్మనుంది.
ఇక ఈ వేలంలో హక్కులను సొంతం చేసుకున్న ఏ సంస్థ అయినా రానున్న అయిదు సంవత్సరాల పాటు తమ అధీనంలో ఉంచుకోనుంది. ఇక ఒక మ్యాచ్ ను రూ. 45 కోట్లు కనీస ధరగా నిర్ణయించడం జరిగింది.