నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు మా నాన్నది ఎక్కడ తేవాలన్న కెసిఆర్…!

-

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ శాసన సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. సభలో వందకు వంద శాతం తీర్మానం పెట్టి ఆమోదిస్తామని కెసిఆర్ స్పష్టం చేసారు. సిఏఏ, ఎన్నార్సిపై దేశ వ్యాప్తంగా ఆందోళన ఉందని, చెడు చర్చలు అన్నీ జరుగుతున్నాయని కెసిఆర్ అన్నారు. గవర్నర్ ధన్యవాద తీర్మానం పై మాట్లాడిన కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు ఆయన. తాము తప్పుని ధైర్యంగా చెప్తామని అన్నారు. ఒక రోజు చర్చకు పెట్టి సిఏఏ పై చర్చిస్తామని కెసిఆర్ అన్నారు. నాకే బర్త్ సర్టిఫికేట్ దిక్కు లేదు ఇంకా మా నన్నది ఎక్కడి నుంచి తీసుకురావాలని కెసిఆర్ ప్రశ్నించారు. నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు మీరు ఎవరు అంటే నేను ఎం చెప్పాలి…? నాకే దిక్కు లేనప్పుడు ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నించారు.

దళితులు, పేదలు ఎక్కడి నుంచి తీసుకోస్తారని ఆయన ప్రశ్నించారు. సభలో వందకు వంద శాతం ఆమోదిస్తామని, ఒవైసీకి ఇదే విషయం తాను చెప్పా అని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని తెలంగాణాలో అమలు చేసేది లేదని అన్నారు కెసిఆర్. కాగా పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఇప్పటికే కెసిఆర్ అమలు చేసేది లేదని స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ ప్రసంగంలో మాత్రం వ్యతిరేక తీర్మానం గురించి ప్రస్తావించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news