కవితకు కీలక పదవి ఖాయం చేసిన కెసిఆర్…!

-

తెలంగాణా రాజకీయాల్లో కెసిఆర్ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందు అయినా తర్వాత అయినా సరే రాజకీయాల్లో కెసిఆర్ కుటుంబం చెరగని ముద్ర వేసింది అనేది వాస్తవం. ఉద్యమ నేతగా ఉన్న కెసిఆర్ అంచెలు అంచెలు గా తెరాస పార్టీని మలిచిన తీరు అన్నీ కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక కెసిఆర్ కుటుంబం కూడా రాజకీయాల్లో తమ వంతు పాత్రను పోషించింది.

సాధారణంగా తండ్రి రాజకీయాలు చేస్తే కొడుకులు వెనుక ఉండి చక్రం తిప్పుతారు అనేది వాస్తవం. కాని తెలంగాణాలో మాత్రం ఆ పరిస్థితి ఉండదు. కేటిఆర్, కవిత, హరీష్ రావు అన్నీ తామై చూసుకుంటూ ఉంటారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా పాలన మీద దృష్టి పెడితే గత అయిదేళ్ళు గా కేటిఆర్, హరీష్ రావు పాలనలో సహకరిస్తూనే పార్టీని కూడా పటిష్టం చేసారు అనేది వాస్తవం. ఇక ఆయన కుమార్తె కవిత విషయానికి వస్తే,

ఆమె తెలంగాణా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ గా, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలి గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు హరీష్ కి, కేటిఆర్ కి పదవులు ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడిన కవిత ప్రస్తుతం రాజకీయాల్లో అంత చలాకీగా ఉండటం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. నిజామాబాద్ నుంచి ఓటమి పాలైన తర్వాత ఆమె కాస్త సైలెంట్ అయ్యారు.

అయితే ఆమెకు ఫాలోయింగ్ ఉన్న నేపధ్యంలో కెసిఆర్ కవిత ను రాజకీయాలకు దూరంగా ఉంచడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. ఆమెను ముందు రాజ్యసభకు పంపాలని చూసినా కొన్ని కారణాలన వలన ఆమెకు పదవి దక్కడం లేదు. సీనియర్ నేతగా కేశవరావు సహా కొందరి పేర్లు వినపడుతున్నాయి. దీనితో రాష్ట్ర రాజకీయాల్లోనే కవితను ఉంచి ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని, ఎమ్మేల్సీని చెయ్యాలని భావిస్తున్నారట. రాజ్యసభ ఎన్నికల తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు పదవి రావడం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news