టార్గెట్ పెట్టిన కేసీఆర్…?

-

ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు కొన్ని అంశాలను సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సరే కోదండరామ్ కు అలాగే తీన్మార్ మల్లన్న కు భారీగా ఓట్లు వచ్చాయి. దీనితో సీఎం కేసీఆర్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల విషయంలో మంత్రులకు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

మండలాల వారీగా మంత్రులకు సీఎం కేసీఆర్ టార్గెట్ పెట్టారు. నియోజకవర్గం లో ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా కొంత మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఆయన స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ అలాగే మంత్రులు జగదీశ్ రెడ్డి అలాగే శ్రీనివాస్ గౌడ్ అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అలాగే ఇతర జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. అయితే కొన్ని మండలాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మెజారిటీ విషయంలో టార్గెట్ పెట్టారని అక్కడ జానారెడ్డి బలంగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ కొంతమంది వద్ద వ్యక్తం చేశారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాగార్జునసాగర్ లో ఓడిపోతే మాత్రం ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గాల్లో బాధ్యతలను తగ్గించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news