ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ

ముందస్తు ఎన్నికలపై క్లారటీ ఇచ్చారు కేసీఆర్. ఆరు నూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లానని.. అప్పటి పరిస్థితుల కారణంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లానని ఆయన అన్నారు. మేం ప్రారంభించిన పథకాలు.. మేం ప్రారంభించిన ప్రాజెక్ట్ మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండటంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లానని.. 88 సీట్లతో గెలిపొందానని ఆయన అన్నారు.

 ప్రస్తుతం అన్ని ప్రాజెక్ట్ లు పూర్తవుతున్నాయని… సీతారామ, పాలమూరు ప్రాజెక్ట్ లు పూర్తవుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో మరింత ధాన్యం పండించాలని.. ఐటీ, పరిశ్రమ పెట్టుబడులు రావాలని… మా టర్మ్ మొత్తం పరిపాలన అందిస్తామని ఆయన అన్నారు. ఏదైనా ఆశ ఉంటే మేమేం చేయలేమని ఆయన అన్నారు. ఏరకంగా స్థాయి లేనివారు ఇలా ప్రచారం చేస్తున్నారని.. ఎల్లుండి ఎలక్షన్ వస్తుందని అనుకుంటే సాధ్యం అవుతుందా.. అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏం చెప్తాడో అదే చేస్తాం అని అన్నారు.