సావిత్రి జిందాల్ భారతదేశపు అత్యంత సంపన్న మహిళా వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త. 71 ఏళ్ల ఆమె ప్రస్తుతం జిందాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.హర్యానా లోని మహారాజా అగ్రసేన్ మెడికల్ కాలేజీ, అగ్రోహా అధ్యక్షురాలు కూడా .ఈరోజు ఆమె జన్మదినం సందర్బంగా ఆమె ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
సావిత్రి జిందాల్ 20 మార్చి 1950న తిన్సుకియా, అస్సాంలో జన్మించారు. సావిత్రికి ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు రాజకీయ నాయకుడు ఓంప్రకాష్ జిందాల్‌తో 1970లో వివాహం జరిగింది.
జిందాల్ గ్రూప్‌ను OP జిందాల్ గ్రూపును 1952లో OP జిందాల్, వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా జిందాల్ ప్రారంభించారు. ఈ గ్రూప్ లో ఉక్కు, శక్తి, మైనింగ్, చమురు మరియు గ్యాస్ మరియు పవర్ పరిశ్రమలు నడుస్తున్నాయి. OP జిందాల్ హర్యానా అసెంబ్లీ స్థానం హిసార్ నుండి మంత్రిగా కూడా ఉన్నారు. 2005లో హెలికాప్టర్ ప్రమాదంలో భర్త ఓపీ జిందాల్ హఠాన్మరణం చెందడంతో, మొత్తం వ్యాపార భాద్యతలను సావిత్రి జిందాల్ చేపట్టారు
.
కంపెనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఆమె వ్యాపారంలోని ఈ నాలుగు విభాగాల్లో ప్రతి ఒక్కదానిని ఆమె నలుగురు కుమారులు, పృథ్వీరాజ్, సజ్జన్ , రతన్ మరియు నవీన్ నిర్వహిస్తున్నారు .జిందాల్ గ్రూప్ లోని జిందాల్ స్టిల్స్ భారతదేశంలో మూడవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు.
సావిత్రి రాజకీయ రంగంలో రాణించారు.ఆమె హిస్సార్ నియోజకవర్గం నుంచి 2005 , 2009 లలో శాసనసభ సభ్యురాలిగా పనిచేసింది. హర్యానా ప్రభుత్వంలో రెవెన్యూ మరియు విపత్తు,పునరావాసం మరియు గృహనిర్మాణ౦, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు.
సావిత్రి జిందాల్ గారు భారత దేశంలో సంపన్న మహిళా వ్యాపార వేత్తలలో ఒకరు. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన ప్రకారం భారతదేశంలో వ్యక్తిగత సంపద పరంగా సావిత్రి జిందాల్ & కుటుంబాన్ని 14వ స్థానంలో ఉంచింది , సావిత్రిని దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా చేసింది. ఆమె 2010లో $12.2 బిలియన్ల సంపదను కలిగి ఉంది . ఇప్పటికీ ఆసియా లోనె అత్యంత సంపన్న మహిళల జాబితాలో ఆమెకు చోటు ఉంటూనే ఉంది.
వ్యాపారం , రాజకీయ రంగాలతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా కృషిచేస్తున్న సావిత్రి జిందాల్ ఎందరో యువ మహిళా పారిశ్రామిక వేత్తలకు అదర్శప్రాయురాలు.