త్వరలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ ఆధికారుల సమావేశం.. దేశ పరిస్థితులపై చర్చ- సీఎం కేసీఆర్

-

త్వరలో హైదరాబాద్ లో రైటర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సమావేశం నిర్వహిస్తామని… దేశంలోని పరిస్థితులపై చర్చిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అందరూ కలిసి వస్తారని.. ప్రజల వెంట అందరూ వెళ్లాల్సిందే అని కేసీఆర్ అన్నారు. మేథోమధనం తరువాత పోరాట కార్యక్రమం ప్రారంభిస్తామని ఆయన అన్నారు. బీజేపీ పాలనపై చర్చకు రెడీ అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. మోదీ మోడీ టోపీలు, పంచలు మార్చితే అభివృద్ధి అంటామా ? అని ప్రశ్నించారు. తమిళనాడు వెళ్తే లుంగీ కట్టడం, మణిపూర్ టోపీ పెట్టడం అభివృద్ధి అంటామా అని ప్రశ్నించారు.  ఒకటి రెండు రోజుల్లో ముంబై వెళ్లి సీఎం ఉద్ధవ్ ఠాక్రేని కలుస్తా అని కేసీఆర్ అన్నారు. ప్రధానికి గోడకు చెప్పినా ఒకటే అని.. దేశ ఆర్థిక పరిస్థితిని పెంచే అవగాహన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేవని ఆయన విమర్శించారు. బయటి రాష్ట్రాల్లో ఎంఐఎం గెలిస్తే మంచిదే కదా.. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ఎంఐఎం గెలిచింది కదా అని కేసీఆర్ అన్నారు. అసదుద్దీన్ తెలంగాణ బిడ్డే కదా అని ఆయన అన్నారు. గుజరాత్ సీఎంగా ఉండీ మోదీ ప్రధాని అయ్యారని.. నేను ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అన్నది తేల్చుకోవడానికి రెండేళ్లు ఉందని కేసీఆర్ అన్నారు. ప్రధాని 5వ తేదీన హైదరాబాద్ వస్తే స్వాగతం పలుకుతానని.. ప్రోటోకాల్ పాటిస్తా అని.. ప్రధానికి ఇవే విషయాలు చెబుతా అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news