ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు సీఎం కేసీఆర్ భూమి పూజ

దేశ రాజధాని ఢిల్లీలో అధికార టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సందర్భంగా… తెలంగాణ ముఖ్యమంత్రి మరియు టి ఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు… పార్టీ ఆఫీస్ కు భూమి పూజ నిర్వహించారు. పార్టీ ఆఫీస్ భూమిపూజ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు మరియు కార్యకర్తలు హాజరయ్యారు.

దేశ రాజధాని ఢిల్లీ లోని వసంత్ విహార్ లో టిఆర్ఎస్ పార్టీ భవన్ నిర్మాణం అవుతోంది. 13 వందల గజాల స్థలం లో త్రి ప్లస్ త్రీ భవనాన్ని నిర్మించనున్నారు.  ఇక ఈ భూమిపూజ కార్యక్రమానికి… నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ వెళ్లారు. నిన్న రాత్రి టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో బస చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్… ఇవాళ మధ్యాహ్నం పూట.. ఢిల్లీలోని వసంత్ విహార్ స్థలానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే భూమిపూజ లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.