వైసీపీలో కలవరం..ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ కష్టమేనా!

-

గత ఎన్నికల్లో కేవలం జగన్ గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వైసీపీ 151 సీట్లు గెలిస్తే అందులో సగం మంది జగన్ గాలిలోనే గెలిచారని చెప్పొచ్చు. అలా జగన్ వేవ్ లో గెలిచిన వారిలో మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వారు కూడా ఉన్నారు. చాలామంది మొదటి సారి ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు. ఇక అలాంటి ఎమ్మెల్యేలు వైసీపీ అధికారంలోకి వచ్చాక బాగా పనిచేసి సొంత ఇమేజ్ పెంచుకుంటే ఇబ్బంది లేదు…అలా కాకుండా ప్రజా వ్యతిరేకతని పెంచుకుంటేనే కష్టం.

ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ కొందరు ఎమ్మెల్యేలని జగన్ ఇమేజ్ కూడా కాపాడటం కష్టం అన్నట్లు పరిస్తితి ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ఎక్కువ కష్టాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..పైగా రాజధాని అంశం వైసీపీ ఎమ్మెల్యేలకు బాగా నష్టం చేకూర్చేలా ఉంది.

గత ఎన్నికల్లో కృష్ణాలో మొదటసారి గెలిచిన ఎమ్మెల్యేలు…నందిగామలో జగన్ మోహన్ రావు, అవనిగడ్డలో సింహాద్రి రమేష్, పామర్రులో కైలే అనిల్ కుమార్, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, కైకలూరులో దూలం నాగేశ్వరరావు. గుంటూరులో వచ్చి చిలకలూరిపేటలో విడదల రజిని, తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి, పొన్నూరులో కిలారు రోశయ్య, వినుకొండలో బ్రహ్మనాయుడు, తెనాలిలో శివకుమార్, పెదకూరపాడులో నంబూరు శంకర్ రావు, గురజాలలో మహేశ్ రెడ్డి ఉన్నారు.

వీరంతా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే…వీరిలో ఏదో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారు సొంతంగా ఇమేజ్ పెంచుకోలేదు. పైగా కొందరిపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. అలాంటి వారు మళ్ళీ ఎమ్మెల్యేలుగా నిలబడితే గెలవడం కష్టమని తెలుస్తోంది…ఈ సారి వారిని జగన్ ఇమేజ్ కూడా కాపాడలేదని అర్ధమవుతుంది. మొత్తానికి ఈ రెండు జిల్లాల్లో ఫస్ట్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సెకండ్ టైమ్ గెలిచే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news