తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం…!

-

తెలంగాణ రాష్ర్టం అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.అధికార బీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ పార్టీలు ప్రస్తుతం హోరాహోరీగా అధిక్యతలో దూసుకుపోతున్నాయి.అంతిమంగా కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లను సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లు ఉన్నాయి. 60 సీట్లు సాధిస్తే చాలు ఇక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేయొచ్చు.అయితే అధికారానికి అవసరమైన 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే లీడ్లో ఉంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ దాదాపు 64 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారనేది మరో రెండు గంటల్లో తేలిపోనుంది.

తెలంగాణలో నవంబరు 30న 119 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.మరోవైపు ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా కాంగ్రెస్ గెలుస్తుందన్న ఆశతో ఆ పార్టీ కార్యకర్తలు,అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.మరోవైపు నిన్న రాత్రి భారీ ఎత్తున సంబరాలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్… బీఆర్ ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అయితే తాజాగా వస్తున్న ఫలితాలను చూసి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. హ్యాట్రిక్‌ సాధిస్తామన్న ధీమాతో ఉన్న ఆ పార్టీ నేతలకు తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి.

ప్రస్తుతం అన్ని కేంద్రాల్లో కౌంటింగ్‌ జరుగుతోంది. మిని పార్లమెంట్‌ ఎన్నికలుగా పలువురు రాజకీయ విశ్లేషకులు ఈ ఎన్నికలను అభివర్ణించారు.మరో రెండు గంటలు గడిస్తే స్పష్టమైన ఆధిక్యం ఎవరికి దక్కనుందనేది తెలిపోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news