కుర్చీలతో కొట్టుకొని.. తన్నుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

-

మార్చలేం. కుక్క తోక వంకర అంటారు కదా. అలాగే ఉంటది ఈ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కూడా. అబ్బే వాళ్లను మనం అస్సలు మార్చలేం. వాళ్లు మారరు. ఏ చిన్న మీటింగ్ జరిగినా.. కుర్చీలు విరగాల్సిందే. ఎవరినో ఒకరిని తన్నాల్సిందే. అదే కాంగ్రెస్ పాలసీ మరి. ఎన్నేళ్ల నుంచి చూడట్లేదు కాంగ్రెస్ నాయకుల మనస్థత్వం.

తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. అవి సరిపోకపోవడంతో తన్నుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. తెలంగాణ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఎన్నికైన తర్వాత ఇవాళ గాంధీ భవన్‌లో ఆయనకు సన్మాన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ నేతలు చాలా మందే వచ్చారు. సన్మానం అయిపోయిన తర్వాత వీహెచ్ వర్గం, ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ నూతి శ్రీకాంత్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. అది కాస్త పెద్దదయింది. దీంతో ఒకరిని మరొకరు కొట్టుకోవడం ప్రారంభించారు.

ఇంతకీ వీళ్ల గొడవకు కారణం ఏంటంటే.. శ్రీకాంత్‌కు టికెట్ రానీయకుండా వీహెచ్(వీ హనుమంతారావు) అడ్డుకున్నారని శ్రీకాంత్ వర్గం ఆరోపిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట టికెట్‌ను శ్రీకాంత్ ఆశించగా.. దాన్ని రాకుండా వీహెచ్ చేశాడన్న అనుమానంతో వాళ్ల గొడవ మొదలైందన్నమాట. కాంగ్రెస్ పెద్దల ముందే ఇలా ఒకరిని మరొకరు కొట్టుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version