ద‌ళిత సీఎం హామీని ఎత్తుకున్న కాంగ్రెస్‌.. ఇంకెన్నాళ్లీ రొటీన్ రాజ‌కీయాలు

-

తెలంగాణ లో దళిత సీఎం ప్రస్తావన మరో సారి తెరపైకి వచ్చింది. స్వరాష్ర్టం సిద్దించాక.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానిని ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందే ప్రస్తుత ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కానీ ప్రత్యేక రాష్ర్టం వచ్చిన తర్వాత ఈ హామీ కనుమరుగైంది. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు , విపక్షాలు భారీ రాద్దాంతం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. తాజాగా తెలంగాణ రాష్రంలోని యాదాద్రి భవనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మరియమ్మ అనే దళిత మహిళ పోలీస్ లాకప్ లో మరణించడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష కూడా చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు.

 

ఈ సందర్భంగా టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… మరియమ్మను ఆమె పిల్లల ముందే లాకప్ లో చంపేయడం దారుణమని అన్నారు. దళితులంటే ఎందుకంత చులకన అని సీఎంను ప్రశ్నించారు. దళితులకు ఇస్తామన్న భూ పంపిణీ ఏమైందన్నారు. దళితులపై టీఆర్ఎస్ వైఖరి సరికాదన్నారు.

మరో పక్క కాంగ్రెస్ నాయకుల డిమాండ్లపై పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఆరేళ్లుగా మరిచిపోయిన దళిత సీఎం హామీ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని చర్చించుకుంటున్నారు. ఇంకెన్నాళ్లిలా మూస ధోరణిలో రాజకీయాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఇలా రాజకీయాలు చేసినంత కాలం కాంగ్రెస్ పార్టీకి ఆదరణ దక్కదని అంటున్నారు.

ప్రస్తుతం రాష్ర్టంలో ఎన్నో సమస్యలు ఉండగా.. దళిత సీఎం హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు ప్రధాన ప్రతిపక్షమైనా కాంగ్రెస్ గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని అంటున్నారు. దళితుల కోసమే మా పోరాటం అని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటే.. రాష్ర్ట ప్రజలు వేరేలా ఆలోచించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news