తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ రావొచ్చు – కాంగ్రెస్ నేత చెప్తున్నది ఇదే

-

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.ఈసారి దక్షిణాదిలో మెజారిటీ సీట్లను సాధిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదేక్రమంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని అంటోంది.ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు.కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. మే 13వ తేదీన జరిగిన పోలింగ్ తమకే అనుకూలంగా ఉందని ఆయన అంటున్నారు.ఇక బీఆర్ఎస్ కూడా లోకసభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తామని అంటోంది. రైతులే బీఆర్ఎస్ ని గెలిపించబోతున్నారని ఇదివరకే కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇంతకీ ఏ పార్టీ ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుంది అనేది తేలడం లేదు.

తెలంగాణలో విజయావకాశాలపై రాజకీయ విశ్లేషకులు సైతం రివ్యూలు చేస్తున్నారు. ఎవరికి వారు ఏదో ఒక పార్టీకి మెజారిటీ కట్టబెట్టేస్తున్నారు. ఆ పార్టీయే ఎక్కువ సీట్లు గెలవబోతోందని ఎవరికి ఇష్టం వచ్చిన లెక్కలు వాళ్ళు వేసేస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు గోనె ప్రకాష్ రావు ఇచ్చిన రివ్యూ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీజేపీకి ఆయన రివ్యూ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాలలో ఆరు స్థానాలలో బిజెపి,ఐదు స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని గోనె ప్రకాష్ రావు చెప్పుకొచ్చారు.

బిజెపి 6, కాంగ్రెస్ ఐదు, ఎంఐఎం ఒకటి, ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లో టఫ్ ఫైట్ ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ సీట్లలో ప్రధాన పార్టీల నేతలు హోరాహోరీగా తలపడ్డారు. గొనె ప్రకాశరావు అంచనాల ప్రకారం బీజేపీ 6 సీట్లు ఖచ్చితాంగా గెలుస్తుందని అంటున్నారు.5 కాంగ్రెస్ వశం అవుతాయాని ఎప్పటిలాగే హైద్రాబాద్ సెగ్మెంట్లో ఎంఐఎం గెలుస్తుందని అంచనా వేశారు. మరో 5 సెగ్మెంట్లలో టఫ్ ఫైట్ జరుగుతున్నదని అంటున్నారు. ఆ ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో భువనగిరి, జహీరాబాద్, మహబూబ్ నగర్ లలో బీజేపీ ఎడ్జ్ ఎక్కువ ఉన్నట్లు చెప్తున్నారు. వరంగల్ సెగ్మెంట్లో కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉందని రివ్యూ ఇచ్చారు. ఒక్క మెదక్ లో మాత్రమే బీఆర్ఎస్ పోటీ ఇస్తుందని, గెలుపు మాత్రం ఆ పార్టీకి సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. మరి ఆయన అంచనాలు ఏ మాత్రం నిజం అవుతాయో చూడాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news