పీవీ నరసింహరావుకు అవమానం…. కాంగ్రెస్ ‘శింతన్ శిబిర్’ లో కనిపించని పీవీ హెర్డింగులు

-

కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా ‘ శింతన్ శిబిర్’ సమావేశాలను నిర్వహిస్తోంది. వరస పరాజయాలతో ఢీలా పడుతున్న కాంగ్రెస్ పార్టీ… శింతన్ శిబిర్ ద్వారా మళ్లీ పూర్వపు వైభవాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. పార్టీలో పూర్తి స్థాయిలో మార్పు కనిపించాలే పలు తీర్మానాలు చేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కీలక నేతలు శింతన్ శిబిర్ కోసం రాజస్తాన్ కదిలివెళ్లారు. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ శింతన్ శిబిర్ వేదికగా మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు అవమానం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పలువరు నాయకుల ఫోటోలతో హెర్డింగులు ఏర్పాటు చేశారు. అయితే ఇండియాలో  సంస్కరణలకు కారమైన దేశ ఆర్థిక వ్యవస్థ పరిష్టతకు కారణమైనా పీవీ నరసింహరావు ఫోటోలు లేవు. జాతి పిత మహాత్మ గాంధీ చిత్ర పటంతో పాటు జాతీయ నాయకులు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తదనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన మంత్రులైన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, డా. మన్మోహన్ సింగ్ చిత్రపటాలతో హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. అలాగే దేశ భక్తులు రవీంద్రనాధ్ ఠాగూర్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్, సరోజనీ నాయుడు చిత్ర పటాలతో హోర్డింగులు..సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే, బి.ఆర్. అంబేద్కర్‌ చిత్రపటాలతో కూడా హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. యూపీఏ హాయాంలో ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ చిత్ర పటాలు ఉన్నా… పీవీ నరసింహరావు చిత్ర పటం మాత్రం ఏక్కడా కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news