ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయం గురించి, నాయకత్వ మార్పు గురించి నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం గాంధీ కుటుంబం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని ఆమె అన్నారు. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం వల్లే బలహీనపడిందని అనుకుంటున్నారని.. కొంత మంది నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆమె అన్నారు. పార్టీ భావిస్తే నేను , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజీనామాలకు సిద్ధం అని ఆమె అన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. ఈనిర్ణయాన్ని వ్యతిరేఖించింది. తాత్కాలికి అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే ఉండాలిని తీర్మాణం చేసింది. ఆగస్టు 20న పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ తిరిగి అధ్యక్ష పదవిని చేపట్టాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం జైపూర్ లో శింతన్ శిబిర్ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎన్నికల్లో ఓటమి, 2024 ఎన్నికలపై చర్చించనున్నారు.