త్రిముఖ వ్యూహంతో హస్తం..పట్టు దొరికేనా?

-

తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ కష్టపడుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉన్నా సరే..రెండు ఎన్నికల్లో ప్రజలు ఆదరించలేదు. తెలంగాణ కోసం పొరాడి సాధించిన కే‌సి‌ఆర్‌ వైపే ప్రజలు మొగ్గు చూపారు. అందుకే రెండుసార్లు బి‌ఆర్‌ఎస్ పార్టీని గెలిపించారు. మరి బి‌ఆర్‌ఎస్ పార్టీ రెండుసార్లు అధికారంలో ఉంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసిందా? అంటే పూర్తిగా 100 శాతం పనిచేసిందనే చెప్పలేని పరిస్తితి కూడా ఉంది.

అసలు కాంగ్రెస్ పార్టీ అయితే..బి‌ఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష మేరకు పనిచేయలేదనే విమర్శలు చేసింది. పైగా తెలంగాణ ఉద్యమ కారులని పక్కన పెట్టి..ఉద్యమ ద్రోహులకు పెద్ద పీఠ వేసిందని ఫైర్ అవుతుంది. అందుకే ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని అంటున్నారు. కేవలం ఒక్క ఛాన్స్ అడుగుతూ ముందుకెళుతున్నారు. అందుకు తగ్గట్టుగా రాజకీయ వ్యూహాలని సైతం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలంతా ఒక్కసారిగా తెలంగాణలో వాలిపోనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలని హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు.

ఈ సమావేశాలు సెప్టెంబర్ 16న జరగనున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే..ఇలా చాలామంది జాతీయ నేతలు రానున్నారు. సెప్టెంబర్ 17న భారీ సభ జరగనుంది. ఈ సభలో పలు కీలక హామీలు ఇవ్వనున్నారు. ఈ హామీలతో ప్రజలని ఆకట్టుకోవాలనేది కాంగ్రెస్ మొదటి ప్లాన్. తర్వాత బి‌ఆర్‌ఎస్ వైఫల్యాలపై చార్జిషీట్ వేసి..ప్రజల్లోకి తీసుకెళ్ళడం రెండవ వ్యూహం. ఇక మూడోది ఈ నెల 18న జాతీయ నేతలు..ఒక్కో నియోజకవర్గం చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో పర్యటించడం..కాంగ్రెస్ మేనిఫెస్టో, బి‌ఆర్‌ఎస్ వైఫల్యాలని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్ళడం. ఇలా కాంగ్రెస్ త్రిముఖ వ్యూహంతో పనిచేయనుంది. మరి ఈ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news