అట్టర్ ప్లాప్ – డిజాస్టర్ – దారుణం: కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కే‌సి‌ఆర్ నవ్వు ఆపుకోలేరు!

-

 

ఒకపక్క కేంద్రంలో బిజెపికి జాతీయ కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి నానాటికీ చాలా దారుణంగా తయారవుతోంది. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, సీనియర్ జూనియర్ బేధాలు మరియు గ్రూపింగ్ లు కలిసి పార్టీ ఎదుగుదలను ఇరకాటంలో పడేశాయి. ఒకవైపు పక్కా ప్రణాళికతో టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం అవుతుంటే మరొకవైపు కాంగ్రెస్ నాయకులంతా అసలు వారి పార్టీ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

 

ఇప్పటికే చాలామంది నాయకులు టిఆర్ఎస్ మరియు బిజెపి లో చేరిపోయారు. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా ప్రారంభిస్తారని ప్రశ్నించి కోర్టు వారిని నోటిఫికేషన్ వాయిదా వేయాలని కోరింది. ఇలా రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని.. ఆ లోగా వారు బలంగా పుంజుకుని ఒక మంచి వ్యూహంతో ముందుకు వెళ్లవచ్చని అనుకున్నారు.

మొదట ఎన్నికల సంఘం తీరును తప్పుపట్టిన కోర్టు ఏడవ తేదీన విడుదల కావాల్సిన నోటిఫికేషన్ కూడా ఆపాలని ఆదేశించింది. అయితే అనూహ్యంగా మంగళవారం జరిగిన విచారణ అనంతరం కోర్టు అభ్యన్తరాలన్నిటిని కొట్టివేయడమే కాకుండా, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు ప్రకటించినట్టుగానే యధావిధిగా విడుదల చేసుకోవచ్చు అంటూ తీర్పు చెప్పింది.దీంతో కాంగ్రెస్ నిరాశలో కూరుకుపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news