‘ సెగ ‘ తట్టుకోలేకపోతున్న ముఖ్యమంత్రి ! 

-

కరోనా వైరస్ మహమ్మారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భయంకరంగా ఉంది. రోజురోజుకీ కేసులు బయట పడుతున్న తరుణంలో కరోనా వైరస్ ‘సెగ’ తట్టుకోలేక పోతున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం కావడంతో వైరస్ వచ్చిన ప్రారంభంలో సరిహద్దులు మూసివేసి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.Yogi Adityanath asks UP officials to prepare action plan for ...కానీ రాష్ట్రంలో కొంతమంది ఆకతాయిలు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం తో యూపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు సమాచారం. మొత్తం 75 జిల్లాల రాష్ట్రం కలిగిన ఉత్తరప్రదేశ్ లో యాభై ఆరు జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. మరణాల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. దీంతో ఇప్పటికే కరోనా వైరస్ పరీక్షలు ఎక్కువ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న యోగి ఆదిత్యనాథ్ మే మూడు తర్వాత కూడా  లాక్ డౌన్ పొడిగించాలని ఆలోచిస్తున్నట్టు టాక్.

 

వేసవి కాలం లో వైరస్ ఎక్కువగా బలపడే అవకాశం లేకపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో జూన్ 30 వరకు లాక్ డౌన్ అమలు లో ఉంచాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్. మరో మహారాష్ట్ర లాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అవ్వకూడదు అని యోగి లాక్ డౌన్ ఈసారి కఠినంగా అమలు చేయటానికి సరి కొత్త రూల్స్ తీసుకు రాబోతున్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news